బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో
చికిత్స తీసుకుంటున్న బాలిక కోలుకుంటున్నట్టు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. రాప్తాడులో రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా ఆయన వివరాలు వెల్లడించారు. “మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై శుభవార్త: ఆమె చికిత్సలో స్థిరమైన పురోగతిని ఉందని వైద్యుల
బృందం గమనించింది. చిన్నారి స్పృహలో ఉంది, ఆమె తల్లి కూడా పరామర్శించారు. ఆమె
ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో, ఈ సాయంత్రం వెంటిలేటర్ సపోర్టు తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఆమె
పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తూనే ఉంటాము” అని లోకేశ్ పోస్టు పెట్టారు. మరోవైపు బాలికను కాపాడేందుకు
ప్రయత్నించిన మరో విద్యార్థిని గురించి కూడా లోకేశ్ ట్వీట్ చేశారు. “ఒక వ్యక్తి చైన్సాతో వారి పాఠశాలలోకి
ప్రవేశించినప్పుడు, లక్ష్మి పారిపోలేదు. ఆమె ముందుకు అడుగు వేసి తన స్నేహితురాలిని
కాపాడటానికి ప్రయత్నించింది, ఆ క్రమంలో తీవ్రంగా గాయపడింది. ఆమె తనను తాను కాపాడుకోగలిగేది, కానీ తన
స్నేహితురాలికి అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఈ రోజు ఇద్దరు బాలికలు
ఆసుపత్రిలో ఉన్నారు. లక్ష్మి తన గాయాలకు చికిత్స పొందుతోంది. ఆమె చర్యలు స్నేహం, ధైర్యం
నిజమైన అర్థం ఏంటో మనకు గుర్తు చేస్తాయి. మా ప్రభుత్వం రెండు కుటుంబాలకు అండగా
నిలుస్తుంది. వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సంరక్షణ అందేలా చూస్తాము.
ఆంధ్రప్రదేశ్లో ఏ బిడ్డ కూడా తరగతి గదిలో అభద్రతకు గురికాకుండా ఉండేందుకు చర్యలు
తీసుకుంటాం” అని తెలిపారు.




